తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Samagra Shiksha Employees : సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సమ్మె జీతాలు విడుదలకు ఉత్తర్వులు జారీ

Samagra Shiksha Employees : సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సమ్మె జీతాలు విడుదలకు ఉత్తర్వులు జారీ

11 November 2024, 17:29 IST

google News
  • Samagra Shiksha Employees : కేజీబీవీల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో వేతనాల పెంపు, ఇతర డిమాండ్లపై 21 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సమ్మె జీతాలు విడుదలకు ఉత్తర్వులు జారీ
సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సమ్మె జీతాలు విడుదలకు ఉత్తర్వులు జారీ

సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సమ్మె జీతాలు విడుదలకు ఉత్తర్వులు జారీ

సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల చేసేందుకు మంత్రి నారా లోకేశ్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిసెంబర్‌ 20, 2023 నుండి జనవరి 10, 2024 వరకు 21 రోజుల పాటు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె తర్వాత కేజీబీవీలలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గౌరవ వేతనాన్ని 23 శాతం పెంచుతూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం మెమో విడుదల చేసింది. 2019కు ముందు గౌరవ వేతనం పెంచని వాళ్లకు 23 శాతం మేర జీతాలు పెంచారు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తోన్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తోన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్లతో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె కాలానికి వేతనం చెల్లించాల్సిందిగా సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు ఇటీవల మంత్రి లోకేశ్ ను కలిశారు. ఉద్యోగుల వినతిని మానవతా దృక్పథంతో పరిశీలించి సమ్మెకాలానికి వేతనాలు విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించానని, దీనిపై ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె జీతాలు విడుదలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేశ్ కు ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

“సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల 21 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన పెండింగ్ జీతాల విడుదల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్షా వారికి జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం సుమారు 25,000 మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలిగించే చర్యగా నిలుస్తుంది. మంత్రి నారా లోకేశ్ మా వినతికి స్పందించి, చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం మన రాష్ట్రంలోని సిబ్బందికి, వారి కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చింది. సమగ్ర శిక్షా ఉద్యోగుల పట్ల చూపిన ఈ సానుకూల వైఖరికి, ఆర్థిక సహకారానికి మంత్రి నారా లోకేశ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి సానుకూల నిర్ణయాలు కొనసాగుతాయని ఆశిస్తున్నాము. సమ్మెకాలపు నాటి ఒప్పందాలు అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం”- ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ

తదుపరి వ్యాసం