తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Heavy Rain Alert: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం… వచ్చే వారం ఏపీకి మరో ముప్పు, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్

AP Heavy Rain Alert: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం… వచ్చే వారం ఏపీకి మరో ముప్పు, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్

18 October 2024, 4:30 IST

google News
    • AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వాయుగుండం ముప్పు వీడిందనుకుంటే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం గుర్తించారు. దీని ప్రభావంతో  ఈ వారం కూడా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. 
ఏపీలో మరో ఐదు రోజులు వర్షసూచన
ఏపీలో మరో ఐదు రోజులు వర్షసూచన

ఏపీలో మరో ఐదు రోజులు వర్షసూచన

AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను అకా వర్షాలు వీడటం లేదు. ఖరీఫ్‌ పంటల సమయానికి కురుస్తున్న వర్షాలతో రైతాంగం బెంబేలెత్తిపోతున్నారు. ఐఎండి సూచనల ప్రకారం మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వివరించారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

18 అక్టోబర్, శుక్రవారం:

• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

19 అక్టోబర్, శనివారం:

• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

20 అక్టోబర్, ఆదివారం:

• కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

21 అక్టోబర్, సోమవారం:

• అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రలో వర్షాలు..

గురువారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5మిమీ,విశాఖ రూరల్లో 62.2మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 60.7మిమీ అధిక వర్షపాతం నమోదైంది.

తదుపరి వ్యాసం