AP TET 2024 Final Key : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్- రేపు ఫైనల్ కీ, మార్చి 14న ఫలితాలు విడుదల
12 March 2024, 17:24 IST
- AP TET 2024 Final Key : ఏపీ టెట్ ఫైనల్ ఆన్సర్ కీ (AP TET Key)బుధవారం(మార్చి 13)న విడుదల చేయనున్నారు. తుది ఫలితాలను మార్చి 14న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్
AP TET 2024 Final Key : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2024 Key) ఫైనల్ ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ మార్చి 13న విడుదల చేయనుంది. టెట్ అభ్యర్థులు aptet.apcfss.in లో కీ చెక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్ష జరగ్గా, మార్చి 6 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలు పరీక్ష వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. తాత్కాలిక సమాధానాలపై అభ్యంతరాలు తెలిపే విండో అందుబాటులో ఉంది. ఏపీ టెట్ 2024 ఫలితాలను మార్చి 14న విడుదల చేయనున్నారు.
ఏపీ టెట్ 2024 ఫలితాలు(AP TET Results), ఫైనల్ ఆన్సర్ కీ ఎలా చెక్ చేసుకోండి?
Step 1 : ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ aptet.apcfss.in ను సందర్శించండి
Step 2 : హోమ్ పేజీలో ఫైనల్ ఆన్సర్ కీ లేదా రిజెల్ట్స్ లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
Step 4 : ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఏపీ టెట్ 2024 పోర్టల్ ను యాక్సెస్ చేసేటప్పుడు ఏదైనా సహాయం కోసం అభ్యర్థులు పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 9505619127, 9705655349, 8121947387 లేదా 8125046997 కాల్ చేయవచ్చు. ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2024)ను పాఠశాల విద్యాశాఖ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఏపీ డీఎస్సీ షెడ్యూల్ మార్పు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2024 షెడ్యూల్(AP DSC Schedule) లో మార్పులు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మార్చి 25 వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు (AP DSC Hall Tickets)డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సీ 2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షల్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్జీటీ (SGT Posts) పోస్టులకు బిఇడి అభ్యర్థుల అనుమతించే విషయంలో హైకోర్టు (High Court) అభ్యంతరాల నేపథ్యంలో విద్యాశాఖ పరీక్షల నిర్వహణలో మార్పులు చేసింది.
రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. ముందు ప్రకటించిన ప్రకారం మార్చి 15 వ తేదీ నుంచిడీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో పాటు ఇతర ఇబ్బందులతో పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం మంత్రి బొత్స ప్రకటించారు. మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించినట్టు చెప్పారు. డిఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు.