తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Updates : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 22 రైళ్లకు అదనపు కోచ్‌లు, వివరాలు

Railway Updates : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 22 రైళ్లకు అదనపు కోచ్‌లు, వివరాలు

HT Telugu Desk HT Telugu

31 October 2024, 16:30 IST

google News
    • ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లు విశాఖపట్నం మీదుగా వెళ్లనున్నాయి. వీటి వివరాలను వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు పేర్కొన్నారు.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్...22 రైళ్లకు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్...22 రైళ్లకు అదనపు కోచ్‌లు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్...22 రైళ్లకు అదనపు కోచ్‌లు

రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.‌ ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి… రద్దీని క్లియర్ చేయడానికి 22 రైళ్లకు అదనపు కోచ్‌ల పెంచాలని నిర్ణయించింది. ఈ సేవలను ప్రజలు, ప్రయాణికులు వినియోగించుకోవాలని వాల్తేర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ కోరారు.

1. సంబల్‌పూర్-నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20809) రైలకు నవంబర్ 1 నుంచి నవంబర్ 29 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ల పెంచనుంది.

2. నాందేడ్-సంబల్‌పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20810) రైలకు నవంబర్ 2 నుండి నవంబర్ 30 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ల పెంచనుంది.

3. సంబల్పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08311) రైలకు నవంబర్ 6 నుండి నవంబర్ 27 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ల పెంచనుంది.

4. ఈరోడ్-సంబల్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08312) రైలకు నవంబర్ 8 నుండి నవంబర్ 29 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ల పెంచనుంది.

5. విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ (08551) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

6. కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్‌ స్పెషల్ (08552) రైలకు నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

7. విశాఖపట్నం-కిరండూల్ (08551) రైలుకు నవంబర్ 3 నుండి నవంబర్ 24 వరకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంచనుంది.

8. కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు నవంబర్ 4 నుండి నవంబర్ 25 వరకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంచనుంది.

9. విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ (08522) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

10. గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్‌ స్పెషల్ (08521) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

11. భువనేశ్వర్- జగదల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 10 వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

12. జగదల్పూర్- భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) రైలకు నవంబర్ 2 నుండి నవంబర్ 11 వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

13. భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ (20837) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

14. జునాగర్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (20838) రైలకు నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ పెంచనుంది.

15. పూరీ-యశ్వంత్‌పూర్ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ (22883) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 29 వరకు ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ పెంచనుంది.

16. యశ్వంత్‌పూర్-పూరీ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ (22884) రైలకు నవంబర్ 2 నుండి నవంబర్ 30 వరకు ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ పెంచనుంది.

17. విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22820) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 5 వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు పెంచనుంది.

18. భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (22819) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 6 వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు పెంచనుంది.

19. విశాఖపట్నం-కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18512) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 4 వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు పెంచనుంది.

20. కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18511) రైలకు నవంబర్ 2 నుండి నవంబర్ 5 వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌లు పెంచనుంది.

21. విశాఖపట్నం-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) రైలకు అక్టోబర్ 31 నుండి నవంబర్ 4 వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌ పెంచనుంది.

22. బ్రహ్మపూర్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18525) రైలకు నవంబర్ 1 నుండి నవంబర్ 5 వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్‌ పెంచనుంది.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ ‌తెలుగు.

తదుపరి వ్యాసం