తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Fire Accident: విశాఖపట్నం ఇండస్‌ హాస్పటల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Vizag Fire Accident: విశాఖపట్నం ఇండస్‌ హాస్పటల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Sarath chandra.B HT Telugu

14 December 2023, 12:24 IST

google News
    • Vizag Fire Accident: విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జగదాంబ జంక్షన్‌లో ఉన్న  ఇండస్ హాస్పటల్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు రోగులు భవనంలో చిక్కుకున్నారు. 
విశాఖలో భారీ అగ్నిప్రమాదం
విశాఖలో భారీ అగ్నిప్రమాదం

విశాఖలో భారీ అగ్నిప్రమాదం

Vizag Fire Accident: విశాఖపట్నం జగదాంబ్ సెంటర్‌లో ఉన్న ఇండస్ హాస్పటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు రోగులు భవనంలో చిక్కుకున్నారు. జగదాంబ జంక్షన్‌లో ఉన్న ఇండస్‌ ఆస్పత్రిలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు వ్యాపించాయి. దీంతో రోగులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో మొదట మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆస్పత్రి మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆస్పత్రి భవనంలో ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో మొత్తం 52మంది రోగులు ఉన్నట్లు గుర్తించారు.

ఆపరేషన్ థియేటర్లలో ఉన్న నైట్రస్ ఆక్సైడ్‌ పేలుళ్లు జరగడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఐసీయూలలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించాయి. ఫైర్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్ సిబ్బంది వేగంగా స్పందించడంతో భవనంలో ఉన్న వారిని కాపాడారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నార్ స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఆస్పత్రిలో దాదాపు అందరిని సురక్షితంగా బయటకు తరలించినట్టు చెబుతున్నారు. ఐసీయూలలో ఉన్న 15మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మూడో అంతస్తులో ఉన్నవారిని కూడా ఫైర్ సిబ్బంది తరలించారు. రెండో అంతస్తులో మంటలు అదుపు రాలేదని, మొదటి, మూడో అంతస్తులో ఉన్న రోగులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం