AP Crime News : ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి - గర్భం దాల్చటంతో వెలుగులోకి అసలు విషయం!
29 November 2024, 22:23 IST
- ప్రేమ పేరుతో ఓ బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు బాలికను లొంగదీసుకున్నాడు. అయితే సదరు బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం పెద్దలకు తెలియటంతో మైనర్లు అయినప్పటికీ పెళ్లి చేయాలనుకున్నారు. అధికారుల ఎంట్రీతో బాలికను చిల్డ్రన్ హోంకు తరలించారు.
కృష్ణా జిల్లాలో ఘోరం.
కృష్ణా జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. బాలికపై ప్రేమ పేరుతో బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాలికకు, బాలుడికి బాల్య వివాహం చేయాలనుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు జోక్యం చేసుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాలికను విజయవాడంలోని చిల్డ్రన్ హోంకు తరలించారు.
ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పెనమలూరు మండలానికి చెందిన ఒక గ్రామంలో 16 ఏళ్ల బాలిక పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయి ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కేబుల్ పనులు చేసే 17 బాలుడు ఆ బాలికను ప్రేమించానని చెప్పాడు. పలుసార్లు చెప్పి బాలికను నమ్మించాడు. ఆపై బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పూనుకున్నాడు.
అయితే ఈ వ్యవహారం ఎవరికి తెలియదు. ఇటీవలి బాలిక ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. దీంతో ఆమెను ఆసుప్రతికి తీసుకెళ్లి, పరీక్షలు చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయింది. బాలికను తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు వివరించింది. ఆమె ప్రస్తుతం రెండో నెల గర్భంతో ఉంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా చేశారు. కుటుంబ సభ్యులు పెద్దలతో మాట్లాడి బాలికకు బాల్య వివాహం చేయాలని కుటుంబ సభ్యులు యత్నించారు.
అయితే దీని గురించి శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు రంగ ప్రవేశం చేసి బాల్యా వివాహాన్ని అడ్డుకున్నారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను విజయవాడలోని ఉన్న బాలికలు హోంకు తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చిన్నారిపై సవతి తండ్రి లైంగిక దాడి...25 ఏళ్లు జైలు శిక్ష:
పశ్చిమగోదావరి జిల్లాలో వరుసకు కూతురయ్యే చిన్నారిపై సవతి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు ఇచ్చారు. జైలు శిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధించారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా అందించాలని తీర్పులో పేర్కొన్నారు.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఆర్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో పాక గ్రామానికి చెందిన కుర్ర ఇమాన్యుయేల్ ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఉంటున్నాడు. వృత్య రీత్యా ఆయన చర్చి ఫాదర్. బాధితురాలి తల్లికి ఆయన రెండో భర్త. నిందితుడు రోజూ కొంతమందితో అడవిలోని మోదుగ ఆకులు ఏరించి… పట్టణ ప్రాంతాలకు అమ్మేవాడు.
2021 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడవిలోని ఒక నిర్జన ప్రదేశంలో రెండో భార్య కుమార్తెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరుకు నిందితుడిపై కేసు నమోదు అయింది. పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 జరిమానా విధించారు.