Trains Cancelled : వాల్తేర్, విజయవాడ డివిజన్లలో 35 రైళ్లు రద్దు… 4 రైళ్లు రీషెడ్యూల్
04 July 2024, 15:11 IST
- వాల్తేరు, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 35 రైళ్లు రద్దయ్యాయి. మరో నాలుగు రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
పలు రైళ్లు రద్దు
Trains Cancelled : రాష్ట్రంలోని వాల్తేర్, విజయవాడ్ డివిజన్‌లో 35 రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ డివిజన్‌లో 30 రైళ్లు రద్దు కాగా, వాల్తేర్ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా మరో పది రైళ్లు రద్దు చేశారు.
వాల్తేర్ డివిజన్‌లో నాలుగు రైళ్లు రీ షెడ్యూల్ చేశారు. అయితే విజయవాడ డివిజన్‌లో ఆగస్టు నెలలో రైళ్లు రద్దు కాగా, వాల్తేర్ డివిజన్‌లో రేపు జూలై 5 (శుక్రవారం)న వాల్తేర్ డివిజన్‌లోని పలాస-విజయనగరం ప్రధాన లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు, ఇతర భద్రత సంబంధిత ఆధునీకరణ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్‌ల కారణంగా పలు రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల సర్వీసులు రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు.
వాల్తేరు డివిజన్‌లో రద్దు అయిన రైళ్లు….
జూలై 5న పలాస నుండి బయలుదేరే పలాస-విశాఖపట్నం ప్యాసింజర్ (07471) రైలు రద్దు. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ (07470) రైలు రద్దు. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-గుణపూర్ ప్యాసింజర్ (08522)రైలును రద్దు చేశారు.
గుణుపూర్ నుండి బయలుదేరే గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ (08521) రైలు రద్దు. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-భవానీపట్న ప్యాసింజర్ (08504) రైలు రద్దైంది .
జూలై 6న భవానీపట్న నుండి బయలుదేరే భవానీపట్న-విశాఖపట్నం ప్యాసింజర్ (08503) రైలు రద్దు అయింది.
జూలై 5న విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-బ్రహ్మాపూర్ ప్యాసింజర్ (08532) రైలు రద్దు. జూలై 6న బ్రహ్మపూర్ నుండి బయలుదేరే బ్రహ్మపూర్ - విశాఖపట్నం ప్యాసింజర్ (08531) రైలు రద్దు.
జూలై 5న విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22820) రైలు రద్దు. జూలై 6న భువనేశ్వరన్ నుండి బయలుదేరే భువనేశ్వర్ - విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22819) రైలు రద్దు చేసినట్లు తెలిపారు.
రీషెడ్యూల్ అయిన రైళ్లు
జూలై 5న భువనేశ్వర్ నుండి మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరాల్సిన భువనేశ్వర్ - రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20896) 2 గంటలు 30 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 2:40 గంటలకు బయలుదేరుతుంది. టాటానగర్ నుండి ఉదయం 05:15 గంటలకు బయలుదేరాల్సిన టాటానగర్ - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (18189) 1గంట 30 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 6:45 గంటలకు బయలుదేరుతుంది.
సంబల్‌పురాట్ నుండి ఉదయం 10:50 గంటలకు బయలుదేరాల్సిన సంబల్‌పూర్ -నాందేడ్ నాగావళి ఎక్స్‌ప్రెస్ (20809) 2 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం నుండి రాత్రి 6ః30 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం - విజయనగరం మెము (07468) రైలు రెండు గంటల ఆలస్యంగా రాత్రి 8:30 గంటలకు బయలుదేరుతుంది.
జూలై 4న సీఎస్ఎంటీ నుండి మధ్యాహ్నం 2. 00 గంటలకు బయలుదేరాల్సిన సీఎస్ఎంటీ-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) 3 గంటలు 30 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడింది.
ఎస్ఎంవీటీ బెంగళూర్ నుండి రాత్రి 11ః40 బయలుదేరాల్సిన ఎస్ఎంవీటీ బెంగళూర్-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12509) గంట ఆలస్యంగా అర్థరాత్రి 12ః40 గంటలకు బయలుదేరుతుంది. సంతర్‌గచ్చి నుండి రాత్రి 11ః40 గంటలకు బయలుదేరాల్సిన సంతర్‌గచ్చి-తాంబరం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06090) 3 గంటలు 30 నిమిషాలు ఆలస్యంగా జూలై 5న తెల్లవారు జామున 03:10 గంటలకు బయలుదేరుతుంది.
విజయవాడ డివిజన్‌లో 30 రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 11 వరకు తెనాలి-విజయవాడ (07630), విజయవాడ-గూడూరు (07500), నర్సాపూర్-విజయవాడ (17270), విజయవాడ-బిట్రగుంట (07978) రైళ్లు రద్దు అయ్యాయి. ఆగస్టు 3 నుంచి 11 వరకు బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17238), గూడూరు-విజయవాడ (07458), విజయవాడ-హుబ్లీ (17329), హుంబ్లీ-విజయవాడ (17330) రైళ్లు రద్దు అయ్యాయి.
ఆగస్టు 5 నుంచి 10 వరకు విజయవాడ-భద్రాచలం (07979), భద్రాచలం-విజయవాడ (07278), తెనాలి-విజయవాడ (075750), డోర్నకల్-విజయవాడ (07755), విజయవాడ-గుంటూరు (07464), గుంటూరు-విజయవాడ (07465), గుంటూరు- సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్- గుంటూరు (17202), విజయవాడ-చెన్నై సెంట్రల్ (12711), విజయవాడ-చెన్నై సెంట్రల్ (12077), చెన్నై సెంట్రల్-విజయవాడ (12712), చెన్నై సెంట్రల్-విజయవాడ (120780) రైళ్లను రద్దు చేశారు.
ఆగస్టు 5 నుంచి 11 వరకు విజయవాడ-నర్సాపూర్ (07862), విజయవాడ-నర్సాపూర్ (17269), విజయవాడ-సికింద్రాబాద్ (12713), సికింద్రబాద్-విజయవాడ (172140), విశాఖపట్నం-కడప (17487), కడప-విశాఖపట్నం (17488) రైళ్లు రద్దు అయ్యాయి. ఆగస్టు 5 నుంచి 12 వరకు విజయవాడ-మాచర్ల (07781), మాచర్ల-విజయవాడ (07782), విజయవాడ-తెనాలి (07629) రైళ్లను రద్దు చేశారు.
ఆగస్టు 2 నుంచి 10 వరకు సికింద్రాబాద్-విశాఖపట్నం (12740), ఆగస్టు 4న గాంధీనగర్-విశాఖపట్నం (20804), ఆగస్టు 7న ఓకా-పూరి (20820), ఆగస్టు 4, 7 తేదీల్లో నిజాముద్దీన్-విశాఖపట్నం (12804), ఆగస్టు 2 నుంచి 10 వరకు చత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్ (11019) రైళ్లు వయా రాయనపాడు మీదుగా దారి మళ్లిస్తున్నారు.