తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Social Media : వైసీపీ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది..? 10 ఆసక్తికరమైన విషయాలు

YSRCP Social Media : వైసీపీ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది..? 10 ఆసక్తికరమైన విషయాలు

Published Feb 11, 2025 02:56 PM IST

google News
    • YSRCP Social Media : ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారింది. సోషల్ మీడియా వింగ్‌లు తమ పార్టీని ప్రమోట్ చేసుకుంటూనే.. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తాయి. ఇది దాదాపు అన్ని రాజకీయ పార్టీల వింగ్‌లు చేసే పని. కానీ.. వైసీపీ సోషల్ మీడియా ఇందుకు భిన్నం. దానికి కారణం జగన్.
వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి

వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి

రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో సోషల్ మీడియా పాత్ర ఊహించని విధంగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే తమను ప్రమోట్ చేసుకుంటున్నారు. అటు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకొని.. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు.

వైసీపీ వేరు..

ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్రపై తాజాగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం వైసీపీ సోషల్ మీడియా వింగ్. అన్ని పార్టీలకు ప్రత్యేక వింగ్‌లు ఉన్నా.. వాటితో వైసీపీ టీమ్‌కు పోలిక ఉండదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వేరే పార్టీలకు పనిచేసే సోషల్ మీడియా విభాగాల మాదిరిగా వైసీపీ వింగ్ పనిచేయదు. ఇతర పార్టీల విభాగాల లక్ష్యాలు వేరుగా ఉంటాయి. కానీ.. వైసీపీ టీమ్ లక్ష్యం మాత్రం జగన్‌ను ప్రొటెక్ట్ చేయడమే అనే అభిప్రాయాలు విస్తృతంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..

1.ఇటీవల రెండు జరిగిన రెండు ఘటనలు వైసీపీ సోషల్ మీడియా విభాగంపై చర్చ జరిగేలా చేశాయి. వాటిల్లో ఒకటి యాక్టర్ పృథ్వి కామెంట్స్ కాగా.. మరొకటి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం.

2.మొదటగా తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ ఇష్యూపై వైసీపీ సోషల్ మీడియా గురిపెట్టింది. రెండ్రోజుల్లోనే ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో వేలాది పోస్టులు దర్శనమిచ్చాయి. వాటిల్లో కిరణ్ రాయల్‌ను టార్గెట్ చేశారు.

3.పోస్టులపై స్వయంగా కిరణ్ రాయల్ మాట్లాడారు. ఇన్ని పోస్టులు, వీడియోలు పెట్టి తనను వేధిస్తున్నారని వాపోయారు. ఆయన మాట్లాడిన మాటలను కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ తమకు అనుకూలంగా మార్చుకుంది.

4.ఇక రెండో ఇష్యూ యాక్టర్ పృథ్వీది. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ పరోక్షంగా వైసీపీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కాంట్రావర్సీగా మారాయి. దీనిపై ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఫైర్ అయ్యారు.

5.పృథ్వీ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా.. 25 వేలకు పోస్టులు పెట్టారు. బాయ్‌కాట్ లైలా పేరుతో ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. వైసీపీ పోస్టులే దర్శనమిచ్చాయి.

6.వైసీపీ సోషల్ మీడియా దాడితో.. లైలా సినిమా బృందం ప్రెస్‌మీట్ పెట్టింది. హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పారు. అయినా సోషల్ మీడియాలో ట్రోలింగ్, పోస్టులు ఆగలేదు. వైసీపీ సోషల్ మీడియా సంతృప్తి చెందలేదు.

7.అయితే వీరు పార్టీ కోసం పనిచేయడం కంటే.. జగన్ కోసం ఎక్కువగా పనిచేస్తారనే పేరుంది. 2024 ఎన్నికలకు ముందు దాదాపు 200 మంది సోషల్ మీడియా వింగ్‌లో పనిచేసేవారు. వీరు పార్టీ ప్రమోషన్ కోసం పనిచేసేవారు.

8.వీరితో సంబంధం లేకుండా.. యూరప్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుంచి కేవలం జగన్ పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. వీరి లక్ష్యం జగన్‌ను హైలైట్ చేయడం. అదే సమయంలో ఎవరైనా జగన్ గురించి మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తారు. జగన్‌కు అనుకూలమైన అంశాన్ని అత్యంత తొందరగా ట్రెండింగ్‌లోని తీసుకొస్తారు.

9.మిగతా పార్టీలు, నాయకుల కోసం పనిచేసే వింగ్‌లతో పోలీస్తే.. జగన్ కోసం పనిచేసే వారు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. క్షణాల్లోనే రియాక్ట్ అవుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ ప్రత్యర్థులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తారనే టాక్ ఉంది.

10.జగన్ 2019లో అధికారంలోకి రావడానికి ఒక కారణం సోషల్ మీడియా అని చెబుతారు. జగన్ బలం, బలహీనత రెండూ ఈ సోషల్ మీడియా కార్యకర్తలే అనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. వీరు జగన్‌ను హైలైట్ చేసే క్రమంలో చేసే కొన్ని పొరపాట్లు ఎన్నికలపై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం