తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Policy 2024 : దోపిడీదారులతో దోస్తీ.. హామీలకు స్వస్తి.. ఏపీ మద్యం పాలసీపై జగన్ చెప్పిన 10 ముఖ్యాంశాలు!

AP Liquor Policy 2024 : దోపిడీదారులతో దోస్తీ.. హామీలకు స్వస్తి.. ఏపీ మద్యం పాలసీపై జగన్ చెప్పిన 10 ముఖ్యాంశాలు!

18 October 2024, 15:13 IST

google News
    • AP Liquor Policy 2024 : ఏపీ నూతన మద్యం విధానంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారుతోందని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం మాఫియాను చంద్రబాబు నడుపుతున్నారని విమర్శలు చేశారు. తమపై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అడ్డగోలు దోపిడీకి తలుపులు తెరిచారని వ్యాఖ్యానించారు.

1.ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు బ్రాండ్లు రిలీజ్ చేశారు. వాటిని వైసీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్, బ్రాండ్లన్నీ చంద్రబాబు తీసుకొచ్చినవేనని జగన్ స్పష్టం చేశారు.

2.మద్యంలోనూ మాఫియాను నడుపుతున్నారు.. మాఫియాలా ఏర్పడి తమవారితో దోపిడీ చేయిస్తున్నారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే.. అందులో 14 డిస్టిలరీస్ లైసెన్సులు బాబు హయాంలో వచ్చినవే. వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదని జగన్ వివరించారు.

3.చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తోంది.. చంద్రబాబు పాలన దోచుకో పంచుకో తినుకో అనట్టు ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో మాదిరి డీబీటీ కనిపించలేదు. ఐదు నెలల్లో ఎక్కడా సూపర్ 6 లేదు సూపర్ 7 లేదని జగన్ సెటైర్లు వేశారు.

4.యా సినిమా బాగుంటే.. ఆ సినిమా పేరు పెట్టి బ్రాండ్లను తీసుకొచ్చారు. దానికి ఉదాహరణే.. పవర్ స్టార్ 999, లెజెండ్ 999 పేరుతో బ్రాండ్లను తీసుకొచ్చారని జగన్ మాస్ ర్యాగింగ్ చేశారు.

5.వైసీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గించాం.. మద్యాన్ని నియంత్రిస్తూనే ప్రభుత్వ ఆదాయం పెంచాం.. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోందని జగన్ ఆరోపించారు.

6.రాష్ట్రంలో పేకాట క్లబ్‌లు పెరిగిపోయాయి.. ఎన్నికల సమయంలో ప్రజల ఆశలతో చెలగాటం ఆడారు.. కూటమి నేతలు అబద్ధాలకు రెక్కలు కట్టారు.. అని జగన్ విమర్శలు గుప్పించారు.

7.ప్రజలు నిలదీస్తారని బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదు.. ఇంటింటికి వెళ్లి మోసపూరిత మాటలు చెప్పారు.. అధికారంలోకి రాకముందు అడ్డగోలు హామీలు ఇచ్చారు.. అని జగన్ ఫైర్ అయ్యారు.

8.ఇప్పుడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటున్నారు.. ప్రశ్నించిన వారిని భయపెడుతున్నారు.. మార్పుల పేరుతో స్కాంలకు తెరలేపారు.. అని జగన్ ఆరోపించారు.

9.ఇసుకపై చాలా ప్రచారం చేశారు.. ఒకవైపు ఇసుక ఉచితం అంటారు.. రేట్లు చూస్తే దారుణం.. ఇప్పుడు లారీ ఇసుక రూ. 65వేల పైనే ఉంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. గతంలో ఏడాదికి రూ. 750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది.. ఈ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సున్నా.. అని జగన్ వ్యాఖ్యానించారు.

10.రూ.10వేలు జీతమని చెప్పి వాలంటీర్లను మోసం చేశారు.. పిల్లలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తదుపరి వ్యాసం