బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడం వాయుగుండంలా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
twitter
By Bandaru Satyaprasad Oct 16, 2024
Hindustan Times Telugu
వాయుగుండం ప్రభావంతో ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
twitter
ఏపీలో రానున్న మూడు రోజులు(బుధ, గురు, శుక్ర) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
twitter
తిరుపతి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయ్యింది. ఇవాళ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. తిరుపతి జిల్లాలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇవాళ 20 సెం.మీ వర్షం కురవవచ్చని అంచనా వేస్తున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9491077356, 08572-242777.
twitter
వాయుగుండం, ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
twitter
హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
twitter
హైదారాబద్ లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇవాళ కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
twitter
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలకు 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద పరిస్థితుల నేపథ్యంలో యజమానులు కార్లను ఫ్లైఓవర్లపై, బైక్ లను ఫ్లాట్ లలో పార్కింగ్ చేసుకుంటున్నారు.