చికెన్ తింటే త్వరగా బరువు పెరుగుతారా?

By Haritha Chappa
May 02, 2024

Hindustan Times
Telugu

అధిక బరువు సమస్యతో బాధపడేవారు చికెన్ తినాలంటే భయపడతారు. త్వరగా బరువు పెరుగుతామని అనుకుంటారు. 

చికెన్ మితంగా తినడం వల్ల బరువు పెరగరు. ప్రతిరోజూ చికెన్ తినేవారు చాలా తక్కువగా తినాలి. 

నిజానికి మితంగా ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల బరువు తగ్గుతారు. దీనిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి తర్వగా ఆకలి వేయదు.

అయితే డీప్ ఫ్రై చేసిన చికెన్, గ్రిల్డ్ చికెన్ వంటివి తినడం వల్ల మాత్రం బరువు పెరిగేస్తారు.

సంప్రదాయ పద్దతిలో చికెన్ కూరను తింటే అంతా మంచే జరుగుతుంది. చికెన్ కూరలో చికెన్ ముక్కలు నీటిలో ఉడుకుతాయి. ఇది మంచి పద్ధతి.

ప్రతిరోజూ చికెన్ తినేవారు చాలా తక్కువగా తినాలి. అది ఉడికించిన చికెన్ మాత్రమే తినాలి. అలాగే ఇతర ఆహారాలు తక్కువగా తినాలి. 

 చికెన్ తక్కువగా తింటే ఫర్వాలేదు, అధికంగా తింటే మాత్రం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవచ్చు. 

ప్రతిరోజూ చికెన్ తినేవారు రోజుకు 50 గ్రాములకు మించకుండా చికెన్ తినాలి. 

జుట్టు రాలే సమస్యను ఇట్టే దూరం చేసే కెరాటిన్​ పుష్కలంగా ఉండే ఫుడ్స్​..

Pexel