వేసవిలో మీ శరీరంలో శక్తిని పెంచగలిగే 5 రకాల ఆహారాలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 30, 2024

Hindustan Times
Telugu

వేసవి కాలంలో శరీరంలో శక్తి త్వరగా తగ్గుతుంది. నీరసంగా అనిపించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ కాలంలో ఎనర్జీ స్థాయిని మెయింటెన్ చేసేలా ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వేసవిలో శరీరంలో శక్తి పెంచగలిగే ఐదు రకాల ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

బాదం, వేరుశనగ కాయలు, ఆక్రోటు, పొద్దుతిరుగుతు విత్తనాలు లాంటి నట్స్, సీడ్స్ వేసవిలో తినాలి. వీటిలోని ఫైబర్, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్ శరీరానికి మంచి ఎనర్జీ అందిస్తాయి. 

Photo: Pexels

అరటి పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ మెండుగా ఉంటాయి. అది తింటే శరీరానికి వెంటనే ఎనర్జీ వస్తుంది. 

Photo: Pexels

చియా సీడ్స్ (సబ్జా గింజలు)ను వేసవిలో తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, అవసరమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచి శక్తిని అందించగలవు. 

Photo: Pexels

చిలగడదుంప కార్బొహైట్రేడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ డైట్‍లో తీసుకుంటే చాలాసేపు ఎనర్జీని అందిస్తాయి. 

Photo: Pexels

ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్ పుష్కలం. అందుకే శరీరంలో శక్తిని ఇవి పెంచగలవు. 

Photo: Pexels

జుట్టు రాలే సమస్యను ఇట్టే దూరం చేసే కెరాటిన్​ పుష్కలంగా ఉండే ఫుడ్స్​..

Pexel