Chiranjeevi Next Movie : కూతురు కోసం సినిమా బడ్జెట్ తగ్గిస్తున్న చిరంజీవి!-chiranjeevi wants to down movie budget for his daughter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Wants To Down Movie Budget For His Daughter

Chiranjeevi Next Movie : కూతురు కోసం సినిమా బడ్జెట్ తగ్గిస్తున్న చిరంజీవి!

HT Telugu Desk HT Telugu
Apr 30, 2023 12:34 PM IST

Chiranjeevi Next Movie : తన కుమార్తె కోసం మెగాస్టార్ చిరంజీవి సినిమా బడ్జెట్ తగ్గి్స్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా.. బడ్జెట్లను కంట్రోల్లో పెట్టే పనిలే పడ్డారట.

చిరంజీవి
చిరంజీవి

వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)తో హిట్ కొట్టారు చిరంజీవి. తర్వాతి చిత్రాలపై ఫోకస్ చేశారు. అయితే బడ్జెట్ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సైరా, ఆచార్య(Acharya) తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల బడ్జెట్లను కంట్రోల్లో పెట్టే పనిలో ఉన్నారట. మళ్లీ భారీ బడ్జెట్ సినిమాలు చేసి రిస్క్ తీసుకోవడం కంటే.. తక్కువ బడ్జెట్ తో సినిమా చేసి.. సక్సెస్ కొట్టాలని చూస్తున్నారని టాక్.

చిరంజీవి(chiranjeevi) తన తన కూతురి నిర్మాణంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. దానికోసం చిన్న లేదా వర్ధమాన దర్శకులు, కథా రచయితల నుంచి కథలు వింటున్నారని సమాచారం. కూతురి కోసం.. చిన్న బడ్జెట్(Low Budget) సినిమాను చేసి.. కూతురికి భారీ లాభాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు వచ్చే.. దర్శకులు భిన్నమైన కథలతో వస్తున్నారు. వారిని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో మెగాస్టార్(Mega Star) ఉన్నట్టుగా తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్యతో భారీ విజయం అందుకున్నారు మెగాస్టార్. ఇక ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. గాడ్ ఫాదర్(God Father), ఆచార్య వంటి సీరియస్ పాత్రలకంటే.. ఎంటరైటైన్ మెంట్ ఇచ్చే పాత్రలను సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఆచార్య కారణంగా స్టార్ డైరెక్టర్ల విషయంలోనూ మెగాస్టార్ ఆలోచనల్లో పడ్డారని తెలుస్తోంది. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట.

మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్(bhola shankar) సినిమా చేస్తున్నారు చిరంజీవి. 2023 ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్(Keerthy Suresh) కనిపించనుంది. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ కలిసి భోళా శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత.. తదుపరి చిత్రం కోసం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో పని చేస్తారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్ని కుదిరితే.. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది. సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని అంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం